BHPL: జిల్లా కేంద్రంలోని సమీకృత కార్యాలయాల్లో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ‘ప్రజావాణి’ అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉదయం హాజరైన వెంటనే, సాయంత్రం వెళ్లేటప్పుడు రెండుసార్లు హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు.