AP: నెల్లూరు జిల్లా గూడూరు నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ గీతా కుమారి తెలిపారు. ఇందిరమ్మ కాలనీలో ఇంటింటికీ వెళ్లి వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో యువత గంజాయి, మద్యం, గుట్కా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికేతే జైలు శిక్షేనని హెచ్చరించారు.