NDL: బనగానపల్లెలో రాజకీయ పార్టీలు, కులమతాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, జెండాలు, కటౌట్లు, హోర్డింగులను రెండు రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించాలని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రభుత్వ విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు, భవనాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు.