నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు రోడ్లు, డ్రైన్లు, విలేజ్ హెల్త్ సెంటర్కు సంబంధించిన ప్రారంభోత్సవ శిలా ఫలకాలు ఆవిష్కరించారు. అనంతరం ఇందుకూరు పేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు.