AP: గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని MLC నాగబాబు కొనియాడారు. అమరజీవి జలధార ద్వారా ఐదు జిల్లాల పరిధిలో రానున్న 35 ఏళ్లలో 1.21 కోట్లమంది దాహర్తి తీర్చాలని పవన్ సంకల్పించారని చెప్పారు. అమరుడైన పొట్టి శ్రీరాములుని స్మరించాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు ‘అమరజీవి జలధార’గా నామకరణం చేశారని అన్నారు.