పెద్దపల్లి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ రంగంపల్లిలోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో వసతులపై ఆరా తీశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థినులు రాబోయే వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు పాల్గొన్నారు.