నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని బీజేపీ జిల్లాఅధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణం కార్పొరేషన్‌గా మారడంతో కేంద్రం నుంచి నిధులు నేరుగా వస్తాయని తెలిపారు. జిల్లా పార్టీ ఆఫీసులో ఇవాళ జరిగిన సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నిధులను దుర్వినియోగం చేసిన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు.