AP: టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు రవికుమార్‌తో కమ్మక్కై పరకామణి కేసును టీటీడీ, పోలీసులు బలహీనపరిచారని మండిపడింది. రవికుమార్, కుటుంబ సభ్యులకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని.. సీఐడీ, ఏసీబీ నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతుందని తెలిపింది.