SRPT: నడిగూడెం జీపీలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ దున్న శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి ఉమ కలిసి మహిళలకు ఈ చీరలను అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.