BDK: పినపాక నియోజకవర్గ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మాఫియా యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు తెలిపారు. స్థానిక గ్రామాల్లోని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు సన్న బియ్యం సేకరిస్తున్న కొందరు వ్యాపారులు, వాటిని సెలవు రోజుల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు.