KMM: మధిర మండలం వెంకటాపురంలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాల సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ పరుచూరి హారినాథ్ అధికారులను కోరారు. ఇవాళ ఆయన గ్రామస్థులతో కలిసి విద్యుత్ శాఖ ఏడీ అనురాధ, ఏఈ మైథిలిలకు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు.