AKP: అనకాపల్లి మండలం సంపతిపురం వద్ద ఏఎంఆర్ మైనింగ్ చెక్‌పోస్ట్‌ను టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ గురువారం పరిశీలించారు. ప్రభుత్వం నిర్ణయించిన బిల్లులు, ఆన్లైన్లో కట్టిన బిల్లులు మాత్రమే తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు.