BDK: ఇల్లందు నియోజకవర్గంలోని క్రైస్తవ పెద్దలు CR క్లబ్లో క్రిస్మస్, నూతన సంవత్సర ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని అన్ని వర్గాల సంక్షేమం కోసం పేదలందరి అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలపై ఆ ప్రభువు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.