SRPT: రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి ఎకరా వరకు నీరు చేరేలా అధికారులు చూడాలని ఎమ్మెల్యే సామేలు సూచించారు. బుధవారం బయ్యన్న వాగు స్టేజ్-2 ద్వారా ఎస్సారెస్పీ నుంచి పంట పొలాలకు నీటిని విడుదల చేసి మాట్లాడారు. విడుదల చేసిన నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు.