TG: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పని అయిపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 నుంచి 8 సీట్లు బీఆర్ఎస్ సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. షాపులో లేని యూరియా యాప్‌లో ఎక్కడిదన్నారు. తమ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్‌కు చెప్తే.. ఎన్ని కావాలంటే అన్ని యూరియా బస్తాలు ఇంటికే వచ్చేవన్నారు.