KMM: రహదారులపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. బుధవారం 17, 18 డివిజన్లో పర్యటించిన కమిషనర్ అక్కడ జరుగుతున్న డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.