ADB: ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా జాతర పోస్టర్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం ఆవిష్కరించారు. జనవరి 18 నుంచి 25 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఎస్పీ మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు పటిష్ఠ భద్రత కల్పిస్తామని తెలిపారు. జనవరి 22న నిర్వహించే ప్రజా దర్బార్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు.