AP: పలువురు మంత్రులతో మంత్రి లోకేష్ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీ మాదిరిగా రప్పారప్పా మన విధానం కాదు. దౌర్జన్యాలు, బెదిరించడం.. తెలుగుదేశం సంస్కృతి కాదు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎంత సేవ చేశామన్నదే మన అజెండా కావాలి. అభివృద్ధి-సంక్షేమం సమన్వయంతో ప్రజలకు ప్రయోజన చేకూర్చాలి’ అని సూచించారు.