W.G: అమరజీవి జలధార ప్రాజెక్టులో భాగంగా అత్తిలి శివారు మట్టపర్తిగరువులో వాటర్ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్తిలి మార్కెట్ కమిటీ ఛైర్మన్ దాసం ప్రసాద్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 90 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణంతో శుద్ధి చేసిన తాగునీటిని ఇంటింటికి పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని దాసం ప్రసాద్ అన్నారు.