NGKL: ఊర్కొండ మండలం రాచాలపల్లి గ్రామంలో నర్సరీ పనులను ఈరోజు సర్పంచ్ మహేష్ ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు నాటి, లక్ష్యానికి అనుగుణంగా పూల, పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటస్వామి గౌడ్, పంచాయతీ కార్యదర్శి ఇందిరా, నాయకులు సుదర్శన్ రెడ్డి, గోపి నాయక్ పాల్గొన్నారు.