KMR: డోంగ్లి మండల పరిధిలోని సిర్పూర్ గ్రామం నుంచి పోతంగల్ వెళ్లే రహదారి అనేక గుంతలమయంగా ఉండేది. ఈ దారుణమైన రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారు. దీంతో స్పందించిన సిర్పూర్ నూతన సర్పంచ్ గజానంద్ పటేల్ ఆ రోడ్డుపై ఉండే గుంతలను గురువారం సాయంత్రం పూడ్చివేశారు. దీనితో వాహనదారులు సర్పంచ్ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.