PLD: దుర్గి మండలం ధర్మవరంలో వెలిసిన శ్రీ చిరుమామిళ్ల సుబ్రహ్మణ్యేశ్వర గురుస్వామి 144వ ఆరాధన మహోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ అర్చకులు సుధాకర్ శాస్త్రి ఉత్సవాల వివరాలను వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.