NLG: విద్యతో పాటు క్రీడలు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీని ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పోటీ తత్వం పెరుగుతుందన్నారు. నల్లగొండలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.