NZB: వేల్పూర్ రెవెన్యూ శివారులోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో గురువారం ఘనంగా పల్లకి సేవ నిర్వహించారని ధర్మ ప్రచారకుడు, మీడియా ప్రతినిధి కంకణాల రాజేశ్వర్ మీడియాతో వెల్లడించారు. పల్లకిలో శ్రీ సాయినాధుని చిత్రపటం, శ్రీ దత్తాత్రేయుని పాదుకలతో అలంకరింపబడిన పల్లకిని ధ్యాన మందిరం నుండి సాయి ధుని, శ్రీ షిరిడి సాయిబాబా గర్భాలయంలోనికి తీసుకెళ్లారు.