VKB: జిల్లా ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చౌడాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన సభావత్ గోపాల్ నాయక్ నియమితులయ్యారు. బుధవారం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు రాములు నాయక్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. ఉపసర్పంచుల హక్కుల పరిరక్షణకు, గ్రామాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో పోరాడుతానని స్పష్టం చేశారు.