MNCL: హాజీపూర్ మండలంలోని రాపల్లి గ్రామంలో ఇవాళ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ మామిడి క్రిష్ణ మాట్లాడుతూ.. పశు పోషణతో బీజామృతం, జీవామృతం, ఘన జీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి పొలంలోనే తయారు చేసి వినియోగించడం వల్ల బహుళ పంటల సాగు విధానాలను వివరించారు. సర్పంచ్ రాంరెడ్డి, ఉప సర్పంచ్ సాగర్ యాదవ్ పాల్గొన్నారు.