TG: నిన్న రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేటీఆర్ వరంగల్ వస్తే.. చెప్పులతో కొట్టి తీరుతామని హెచ్చరించారు. కక్ష సాధింపు వద్దని సీఎం చెప్పడం వల్లే ఆగుతున్నామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు.