VZM: ఇళ్లకు ఆదానీ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.శంకర్రావు తెలిపారు. బొబ్బిలిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్ల వల్ల కరెంటు చార్జీలు పెరిగి ప్రజలపై భారం పడుతుందన్నారు. రీఛార్జ్ విధానం, యూనిట్ రేట్లు స్పష్టత లేకపోవడం, ఒక్కో మీటర్‌కు రూ.10,250 ఖర్చు ప్రజలపై మోపడం అన్యాయమని విమర్శించారు.