KMM: ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి ఐదుగురు మహిళా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం మంత్రి తుమ్మల, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 12, 25, 32, 40, 55వ డివిజన్ కార్పొరేటర్లు లక్ష్మీ, చంద్రకళ, సరస్వతి, శ్రావణి, అమృతమ్మ ఉన్నారు.