VZM: కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఇవాళ కలిశారు. రామభద్రపురం మండలం కోటసిర్లాం రెవిన్యూకి సంబంధించి రెవిన్యూ రికార్డులలో ఉన్న తప్పులు వలన సుమారు 8 పంచాయితీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అవసరమైతే ఒక ప్రత్యేక గ్రామసభను ఏర్పాటు చేసి రెవిన్యూ సమస్యలను పరిష్కరించాలని కోరారు.