ELR: ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8న కొయ్యలగూడెం మార్కెట్ యార్డ్ ఆవరణలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయని, వాటి ద్వారా 1,224 ఉద్యోగాలకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీబీఎం, డిప్లమో, ఫార్మసీ చదివిన వారు అర్హులన్నారు.