2030 నాటికి రైల్వే శాఖ తన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 48 ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. HYD, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలతో పాటు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి స్టేషన్లు కూడా ఉన్నాయి. స్టేషన్ల ఆధునీకరణతో పాటు రైళ్ల సంఖ్యను పెంచి మెరుగైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం.