AP: కోనసీమ జిల్లా మలికిపురంలో ONGC గ్యాస్ లీక్ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్ మహేష్ స్పందించారు. ‘ప్రాణ నష్టం జరగలేదు. కరెంట్ బంద్ చేయడంతో సమీప గ్రామాలు చీకటిమయంగా మారాయి. మంటలు అదుపులోకి రావడానికి మరో 24 గంటలు పడుతుంది. బావిలో 20 వేల నుంచి 40 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉంది. 20 మీటర్ల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. కిలోమీటర్ పరిధిలో అందరినీ ఖాళీ చేయిస్తున్నాం’ అని పేర్కొన్నారు.