దర్శకుడు శ్రీను వైట్ల హీరో శర్వానంద్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనుండగా.. మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక కథ విషయానికి వస్తే.. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట. ఈ చిత్ర షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.