ASR: చింతపల్లి మండలం లంబసింగి ప్రకృతి అందాలు రమణీయంగా ఉన్నాయని ప్రముఖ సినీ నటుడు ప్రభాస్ శ్రీను అన్నారు. ఇవాళ లంబసింగిలో పర్యటించి మంచు అందాలు ఆస్వాదించారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. మహిళలతో కలిసి ఆయన థింసా నృత్యం చేశారు. లంబసింగి చూస్తే ఉత్తర భారతదేశం సందర్శించిన అనుభూతి కలిగిందన్నారు. స్వచ్ఛమైన గాలి, పచ్చని అడవులు కనువిందు చేస్తున్నాయన్నారు.