TG: పొగమంచు ప్రభావంతో పలు విమానాల సేవలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో శంషాబాద్లో ల్యాండ్ కావాల్సిన సుమారు 14 విమానాలను అధికారులు బెంగళూరు, గన్నవరం, చెన్నై విమానాశ్రయాలకు దారి మళ్లించారు. అందులో దుబాయ్, మస్కట్, రియాద్, కువైట్ వంటి విదేశీ నగరాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అలాగే మరో 19 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు.