AP: కోనసీమ మకిలిపురం బ్లోఅవుట్ ఘటనపై CM చంద్రబాబు ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి.. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ONGC అధికారులతో సమన్వయం చేసుకుని.. తనకు అప్డేట్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మకిలిపురం చేరుకున్న స్పెషల్ టీమ్.. మంటల నియంత్రణకు పైపుల ద్వారా నీటిని స్ప్రింగ్ చేస్తోంది.