మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగానే, చిరూ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో ‘మెగా 158’ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ‘వాల్తేరు వీరయ్య’ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.