E.G: గోకవరం పోలీస్ స్టేషన్ రెండో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బీ.నాగమణి సోమవారం తన మానవీయతను చాటుకున్నారు. స్థానిక భక్తుల సూర్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్‌లోని వృద్ధులకు ఆమె అన్నదానం చేశారు. స్వయంగా భోజనాలు వడ్డించి, వారితో కాసేపు ముచ్చటించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని వృద్ధులకు భరోసా ఇచ్చారు.