TG: ఆదిలాబాద్(D)లో సోయా రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరు ఉధృతమైంది. ఈ నేపథ్యంలో BRS పార్టీ ఇవాళ ఆదిలాబాద్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో భాగంగా స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళన చేపట్టిన మాజీమంత్రి జోగు రామన్న సహా పలువురు BRS ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, సోయా పంటను కొనుగోలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.