మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం తప్పనిసరి. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోవడమే కాకుండా, చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది.