TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్నలు తీసుకున్న రూ. లక్ష వరకు వ్యక్తిగత రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అప్పుల భారం నుంచి కార్మికులకు విముక్తి లభించడమే తమ ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6,784 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది.