KMR: ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపంతో కొంతమంది రైతులు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి గురువారం అన్నారు. గాంధారి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన పోడుభూముల సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.