ASF: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్-కాగజ్ నగర్ మార్గంలో ఈనెల 9, 10 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం వెల్లడించింది. ఈ రైలు ఉదయం 7:55కు HYDలో బయలుదేరి మధ్యాహ్నం కాగజ్నగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3:15కు కాగజ్ నగర్లో బయలుదేరుతుంది. మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లిలో ఈ రైలు ఆగుతుంది.