AP: మాజీ సీఎం జగన్ విమర్శలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ కట్టాలో అక్కడే కడుతున్నామని తెలిపారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేస్తే 11 సీట్లు వచ్చే ఎన్నికల్లో జీరో అవుతాయని చెప్పారు.