SRD: గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ టు ఆల్ కబడ్డీ & వాలీబాల్’ క్రీడా పోటీలను శనివారం లాంచనంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. నేటి తరం విద్యార్థులు, యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా క్రీడా కార్యక్రమాలు రూపొందించడం పట్ల ఆయన నిర్వాహకులను అభినందించారు.