MNCL: కాసిపేట మండలం దేవాపూర్కి చెందిన కొల్లూరి మల్లక్క (60) ఈ నెల 5వ తేదీన అదృశ్యమయ్యారు. గోలేటిలో ఉన్న తన కూతురి వద్దకు వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరిన ఆమె, కూతురి వద్దకు చేరలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త భూమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.