‘DJ టిల్లు’ సినిమా దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కిస్తున్న సినిమా ‘అనుమాన పక్షి’. ఈ మూవీలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో బ్రహ్మాజీ భాగమైనట్లు తెలుపుతూ మేకర్స్ టీజర్ అప్డేట్ ఇచ్చారు. ‘బ్రహ్మోస్-ది ట్రేసర్ బుల్లెట్‌ని కలవండి. లక్ష్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. JAN 11న టీజర్ వస్తుంది. ఫిబ్రవరి 2026లో ఈ మూవీ రిలీజ్ కానుంది’ అని తెలిపారు.