BHNG: ప్రముఖ జబర్దస్త్ నటులు చలాకి చంటి ఇవాళ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని అందించారు. చంటి తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడటంతో అక్కడ సందడి నెలకొంది.