VSP: పండగల నేపథ్యంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ కోడి పందాలు, జూదం నివారణకు నాలుగు ప్రత్యేక బృందాలతో కఠిన నిఘా ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ తెలిపారు. పలు గ్రామాల్లో గస్తీ చేపట్టి అక్రమ కార్యకలాపాలు పూర్తిగా అరికట్టామని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.